టీవీ సీరియ‌ల్‌లో క‌నిపించ‌నున్న రెజ్ల‌ర్ బబితా ఫొగ‌ట్‌!

  • 'అండ్ టీవీ'లో ప్ర‌సార‌మ‌య్యే 'బ‌ధో బ‌హూ'లో క‌నిపించ‌నున్న రెజ్ల‌ర్‌
  • అక్క బాట‌లోనే న‌డుస్తున్న చెల్లెలు
  • 'ఖ‌త్రోంకా ఖిలాడీ'లో కనిపించిన గీతా ఫొగ‌ట్‌
హ‌ర్యానాకు చెందిన రెజ్ల‌ర్లు గీతా ఫొగ‌ట్‌, బ‌బితా ఫొగ‌ట్‌ల గురించి ఆమిర్‌ఖాన్ 'దంగ‌ల్' సినిమాతో ప్రపంచం మొత్తానికి తెలిసింది. వెంట‌నే వాళ్ల ప్ర‌జాద‌ర‌ణ‌ను క్యాష్ చేసుకోవ‌డానికి టీవీ ఛాన‌ళ్లు క్యూ క‌ట్టాయి. అందులో భాగంగానే 'ఖ‌త్రోంకా ఖిలాడీ'లో గీతా ఫొగ‌ట్‌తో ధైర్య సాహసాలు చేయించారు. ఇప్పుడు అక్క బాట‌లోనే చెల్లెలు బబితా ఫొగ‌ట్ కూడా న‌డుస్తోంది. 'అండ్ టీవీ'లో ప్ర‌సార‌మ‌య్యే 'బ‌ధో బ‌హూ' సీరియ‌ల్‌లో బ‌బితా ఫొగ‌ట్ క‌నిపించ‌నుంది.

ఈ విష‌యాన్ని సీరియ‌ల్ నిర్మాత‌లు స్ప‌ష్టం చేశారు. నిజానికి గీతా, బ‌బితా ఇద్ద‌రినీ సీరియ‌ల్‌లో న‌టింప‌జేయాల‌ని అనుకున్న‌ట్లు నిర్మాత దీప్తి క‌ల్వాని తెలిపారు. కానీ గీతా ఫొగ‌ట్ వేరే పనుల్లో బిజీగా ఉండ‌టంతో కుద‌ర‌లేద‌ని అన్నారు. లావుగా ఉండే ఓ యువ‌తి.. కుటుంబంలోను, స‌మాజంలోను గుర్తింపుకోసం ప్ర‌య‌త్నించే క‌థాంశంతో ఈ సీరియ‌ల్ న‌డుస్తోంది.
Go Back to Shorts
geeta phogat
babita phogar
dangal
aamir khan
badho bahu
and tv
hindi
tv serial

More Telugu News